Saturday, February 26, 2011

నాకు నచ్చిన పుస్తకం

                         నాకు నచ్చిన పుస్తకం 
                           పరుసవేది  (రచయిత :పాలో కోయిలో )
                ఒకే కప్పు కింద జీవిస్తూ ఒకరికొకరం అర్థం కాని సమాజ భాషలో  జన్మఅంత మాట్లాడుకుంటూ ఉండే స్థితి నుండి సృష్టిలోని ప్రతి అంశంతోను సంభాషించి స్పందిమ్పచేసుకోగలిగిన "విశ్వభాష" స్థాయికి ఎదిగిపోతాం .
                మతాలలో ఇమడలేక సులువైన, సహజమైన ఆధ్యాత్మిక అద్భుతాన్ని అందుకోలేక స్వియప్రేరిత అయోమయోలతో, గంధరగోలాలతో అవస్థ పడుతూ, జనభాహుల్యాన్ని అవస్తపెట్టే ఆధ్యాత్మిక గురువులకి, అమాయక ఆధ్యాత్మిక విద్యార్థులకి ఈ పుస్తకం గొప్ప కనువిప్పు .
                      ఈ చరాచర సృష్టిలోని అంశాలన్నీ ఒక అనుసంధానంతో ఒకే అస్తిత్వం గా పని చేస్తూ ఉంటాయన్న "సృష్టి ఏకత్వ "సూత్రాన్ని ఆధారంగా ఎంచుకొని ఈ కథ సాగడం గొప్ప విశేషం .
                      తను పరిణామం చెందకుండా పరిసరాలలోని ఎ అంశాన్ని  మానవుడు పరిణామం చెందించలేడన్నా అద్భుత వాస్తవాన్ని పరుసవేధత్మకంగా వివరించడానికి రచయిత చేసిన ప్రయత్నం అసమాన్యం .
 
 

No comments: